- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య విగ్రహం తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న శిల్పి.. నెటిజన్లు ఫిదా
హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడు రాముడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్యకంగా నిర్మిస్తున్నారు.

దిశ, ఫీచర్స్: హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడు రాముడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్యకంగా నిర్మిస్తున్నారు. జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ వేడుకకు దేశ నలుమూలల నుంచి తరలి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అలాగే కొందరు రాముడిపై తమ భక్తిని చాటుకుంటూ పాదయాత్ర చేస్తూ రామమందిరానికి బయలుదేరారు.
తాజాగా, కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి అయోధ్యలో ప్రతిష్టించనున్న బాల రాముని విగ్రహం తయారు చేశారు. ఈ క్రమంలో అరుణ్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విగ్రహం తయారు చేసినంత కాలం పాటు ఫోన్ ఉపయోగించకుండా.. మౌన దీక్ష చేశారు. అయితే బాల రాముని విగ్రహం తయారీకి ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆరు నెలలు అరుణ్ మాట్లాడలేదు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా గ్రేట్ అంటూ అరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






