- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికొన్ని గంటల్లో ప్రాణప్రతిష్ట.. సర్వాంగసుందరంగా ముస్తాబైన అయోధ్య
by GSrikanth |
ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అన్నింట్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సంపైనే చర్చ జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అన్నింట్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సంపైనే చర్చ జరుగుతోంది. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకకు అయోధ్య ముస్తాబైంది. అత్యంత వైభవంగా అధికారులు, ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ మహా ఘట్టానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్‌కు యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పార్కింగ్ కోసం ఎటూ తిరుగాల్సిన అవసరం లేకుండా గూగుల్ మ్యాప్‌లో పార్కింగ్ స్పాట్‌లను అప్‌లోడ్ చేశారు.
Next Story






