- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య రాముడిపై ఫేక్ న్యూస్.. కేంద్రం మార్గదర్శకాలివే..!
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో భక్తులను బురిడీ కొట్టిస్తున్నాడు కొందరు. దీనిపై కేంద్రం అలర్టయ్యింది.

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో భక్తులను బురిడీ కొట్టిస్తున్నాడు కొందరు. దీనిపై కేంద్రం అలర్టయ్యింది. దర్శనం, ప్రసాదం, ఫొటోలు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించి తప్పుడు వార్తలు, మోసపూరిత సమాచారాన్ని పబ్లిష్ చేయకుండా, ప్రచారం చేయకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ధ్రువీకరించని, రెచ్చగొట్టే, నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లు గమనించామని పేర్కొంది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. సోషల్ మీడియాతో ఈ సమస్య ఎక్కువగా ఉందంది. శాంతిభద్రతలు, మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రచారం జరుగుతోందంది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయకుండా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్, టీవీ న్యూస్ ఛానెల్స్ పబ్లిషర్స్ జాగ్రత్త వహించాలని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ ని కట్టడి చేయాలని సూచించింది.






