- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
60 గజాల పట్టు వస్త్రంపై రామాయణ ముఖ్య ఘట్టాలు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఆ అయోధ్య రాముడికి 60 గజాల పొడవు గల పట్టు వస్త్రాన్ని సత్యసాయి జిల్లా ధర్మవరం కి చెందిన నాగరాజు అను చేనేత కళాకారుడు తయారు చేశాడు. చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వసాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఆ వస్త్రానికి 'శ్రీరామకోటి పట్టు వస్త్రం' అని నామకరణం చేశాడు. 4 నెలలు శ్రమించి తయారు చేసిన ఆ పట్టు వస్త్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరానికి అందించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. రామయణంలోని ప్రధాన ఘట్టాలను 60 గజాల పట్టు వస్త్రంపై రూపొందించి తన ఉడత భక్తిని చాటుకున్నాడు.
Next Story






