- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య బీజేపీ రాజకీయ ప్రాజెక్టు.. ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్..!
ఈనెల 22న అంగరంగవైభవంగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరగనుంది. ఆలయ ప్రారంభోత్సవానికి పలువురు నేతలకు ఆహ్వానం అందింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఈనెల 22న అంగరంగవైభవంగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరగనుంది. ఆలయ ప్రారంభోత్సవానికి పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఈ వేడుకకు అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపింది. ఆలయ ప్రారంభోత్సవానికి రావట్లేదని స్పష్టం చేసింది కాంగ్రెస్. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అయోధ్య ట్రస్టు ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయోధ్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని ఆరోపించారు. లక్షలాదిమంది రాముడిని పూజిస్తారని.. మతం అనేది వ్యక్తిగత అంశమని తెలిపింది. ఎన్నికల కోసం.. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రారంభించారని ఆరోపించింది. 2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి.. రాముడ్ని పూజించే లక్షలాది మంది మనోభావాలు గౌరవిస్తూ.. ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్.






