కదులుతోన్న అయోధ్య రామమందిర ‘కారు’.. హైదరాబాద్ వాసీ అద్భుత రూపకల్పన (వీడియో)

by Satheesh |   (  Updated:2024-01-27 07:19:25  IST  )

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ నెల 22న అయోధ్యలోని రామందిరంలో రాముడి విగ్రహాల

కదులుతోన్న అయోధ్య రామమందిర ‘కారు’.. హైదరాబాద్ వాసీ అద్భుత రూపకల్పన (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ నెల 22న అయోధ్యలోని రామందిరంలో రాముడి విగ్రహాల ప్రాణప్రతిష్టాపన మహోత్సవం కోసం పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కారు డెకరేషన్ సంస్థ అయోధ్య రామమందిరం ఆకారంలో రూపొందించిన కారు అందరినీ ఆకట్టుకుంటోంది. బహదూర్ పురా సధాకార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ పాతబడిన ఓ వాహనం రూపురేఖలు మార్చి అయోధ్య రామాలయ నమూనాను పోలిన కదిలే కారును తయారు చేశారు.

22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ వాహనం కదులుతుంటే అయోధ్య ఆలయం కదిలినట్లుగా కనిపిస్తుంది. డ్రైవర్ మాత్రమే కూర్చోగలిగే ఈ వాహనం తయారీలో 10 మంది ముస్లిం కార్మికులు కూడా పాల్గొన్నట్టు సుధాకర్ యాదవ్ వెల్లడించారు. ఈ వాహనాన్ని జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రదర్శనకు ఉంచుతామని ఆ తర్వాత గ్రామాల్లోకి తీసుకువెళ్తామన్నారు. అయోధ్యకు వెళ్లలేని భక్తుల వద్దకే ఈ అయోధ్య నమూనా కారు వెళ్తుందని చెప్పారు. ఈ కారులో భజనలు, భక్తి గీతాలు వినిపించేలా సౌండ్ సిస్టమ్‌ను సైతం ఏర్పాటు చేశారు.

Next Story