- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుత సృష్టి.. 2.730 మిల్లీ గ్రాము బంగారంతో రామ మందిర నమునా తయారీ
by Sathputhe Rajesh |
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టాడు.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టాడు. అయోధ్యలో రాముల వారి విగ్రహా ప్రతిష్ట సందర్భంగా భవ్య మందిర నిర్మాణం నమూనాను బంగారంతో సృష్టించాడు. అద్భుతంగా తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసి అందరూ స్థానికులు మెచ్చుకుంటున్నారు. 2.730 మిల్లీ గ్రాము బంగారంతో రామ మందిర నిర్మాణము నమూనాను తయారు చేశాడు. గతంలో కూడా అనేక సూక్ష్మ పరికరాలను తయారుచేశాడు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని తెలిపాడు.
Next Story






