- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య రాముడి కోసం 45 టన్నుల లడ్డూలు
by Shamantha N |
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమవుతోంది. రామాలయానికి వచ్చే భక్తులకోసం లడ్డూలు అందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

X
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమవుతోంది. రామాలయానికి వచ్చే భక్తులకోసం లడ్డూలు అందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 45 టన్నుల లడ్డూలు ప్రసాదంగా ఇచ్చేందుకు పనిచేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత లడ్డూలు పంచిపెట్టనున్నారు. ఇందుకోసం తయారీదారులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. అయోధ్య రామాలయం నిర్మించాలని సూచించిన దివంగత సాధువు దేవ్రా బాబా తరఫున వెయ్యి పదకొండు లడ్డూలను రాముడికి నైవేద్యంగాసమర్పించనున్నారు. స్వచ్ఛమైన దేశీ ఘీ, జీడిపప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా లడ్డూలను తయారు చేస్తున్నారు తయారీదారులు. లడ్డూలు హిందీ, ఇంగ్లీషు రెండింటిలోనూ 'రామ్' అనే పేరును ఉచ్చరించే విధంగా ఏర్పాటు చేశారు.
Next Story






