- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరాముడి కోసం అద్భుత వస్త్రాలు.. ఏకంగా 12 లక్షల మంది..!!
by Kodari Anjali |
ఈ నెల (జనవరి)22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది

X
దిశ, ఫీచర్స్: ఈ నెల (జనవరి)22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. అయితే శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే) పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యి వేసి ఈ వస్త్రాలు నేశారు. శ్రీరాముడి కోసం ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. ఆ వస్త్రాలను తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారికి అందజేసి.. ట్రస్ట్ బృందాన్ని ఆయన అభినందించారు.
Next Story






