- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యలో 108 అడుగుల అగరబత్తి.. వెలిగిస్తే 55 కి.మీ లకు సువాసన
అయోధ్యలో ఈ నెల 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం ఓ భక్తుడు 108 అడుగుల భారీ అగరబత్తి తయారు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో ఈ నెల 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం ఓ భక్తుడు 108 అడుగుల భారీ అగరబత్తి తయారు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఉండే విహా బర్వాద్ ఈ భారీ 108 అడుగుల పొడవాటి అగరబత్తిని 3,610 కిలోల బరువు, 3.5 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. కాగా ప్రస్తుతం ఈ అగరబత్తి అయోధ్యకు వెళ్లే మార్గంలో ఆగ్రాకు చేరుకుంది. వడోదర చెందిన విహా బర్వాద్ తయారు చేసిన ఈ 3.5 అడుగుల వెడల్పు గల అగరబత్తి పర్యావరణానికి అనుకూలమైనది.
ఆరు నెలల పాటు దీని తయారీకి వివిధ రకాల మూలికలు ఉపయోగించి తయారు చేశారు. అగరుబత్తీ తయారీదారు బర్వాద్ ప్రకారం, “ఈ అగరబత్తి దాదాపు ఒకటిన్నర నెలల పాటు నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది. అలాగే దీని వెలిగిస్తే వచ్చే సువాసన దాదాపు 55 కిలోమీటర్ల వరకు వస్తుందని వారు తెలుపుతున్నారు. కాగా ఈ భారీ అగరబత్తి ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి,కిరావాలికి చేరుకోగానే అక్కడి ప్రజలు, రామభక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ.. అగరబత్తీలనున వెలిగించి, పూల వర్షం కురిపిస్తూ శోభాయాత్రకు స్వాగతం పలికారు.






