లే అవుట్ ఓకే….

by  |
లే అవుట్ ఓకే….
X

దిశ వెబ్ డెస్క్: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అనుకున్నట్టుగానే 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు ఆలయ ట్రస్ట్ చర్యలు తీసుకుంటోంది. తాజాగా మందిరానికి సంబంధించిన లేఔట్‌కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ (ఏడీఏ) అమోద ముద్ర వేసింది. ఈ సదంర్భంగా ఏడీఏ కమిషనర్ ఎంపీ అగర్వాల్ మాట్లాడుతూ…టెంపుల్ లే అవుట్ మొత్తం 2.74 లక్షల చదరపు మీటర్లు ఉందని వెల్లడించారు. ఇందులో 12,879 కిలో మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫెకట్లను తీసుకున్నామన్నారు. ఇక పునాది తవ్వకం అనేది అయోధ్య ట్రస్ట్ కు సంబంధించిన విషయమన్నారు. కాబట్టి పునాది తవ్వకాలను ఎప్పుడు స్టార్ట్ చేయాలనే అంశాన్ని ట్రస్ట్ నిర్ణయిస్తుందన్నారు.

Next Story

Most Viewed