పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్!

116

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా గృహ రుణాలు తీసుకునే వారికి 12 ఈఎంఐలను మినహాయింపు ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లను కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆన్‌రోడ్ ఫైనాన్స్‌ను ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాల మంజూరు చేయనున్నట్టు పేర్కొంది. వ్యాపార నిర్వహకులకు వారికి టర్మ్ రుణాలు, ఎక్విప్‌మెంట్ రుణాలు, కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్‌పై అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది.

ప్రత్యేకంగా దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని యాక్సిస్ బ్యాంక్ తన డెబిట్, క్రెడిట్ కర్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రెస్టారెంట్లు, ఇతర రిటైల్ రుణాలు, షాపింగ్‌కి డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వివరించింది. అలాగే, దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఎంపిక చేసిన స్థానిక వ్యాపారుల నుంచి చేసే కొనుగోళ్లపై వినియోగదారులకు 20 శాతం వరకు రాయితీలను ఇవ్వనుంది. ‘ఈ పండుగ సీజన్‌లో వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్‌లతో పాటు స్థానిక రిటైలర్‌లతో భాగస్వామ్యం చేసుకున్నాం. కస్టమర్లకు షాపింగ్, రుణాలపై భారీ డిస్కౌంట్ల, ప్రయోజనాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని’ యాక్సిస్ బ్యాంక్ రిటైల్ రుణాల విభాగం హెడ్ సుమిత్ వెల్లడించారు.