వచ్చే నెల 5న మెడికల్ టీచర్లకు అవార్డులు..

by  |
వచ్చే నెల 5న మెడికల్ టీచర్లకు అవార్డులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ ఏటా సెప్టెంబరు 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు అవార్డులతో సత్కరించడం ఆనవాయితీ. అదే తరహాలో అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డు అక్రెడిటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ సంస్థ కూడా వైద్యరంగంలో ప్రతిభను ప్రదర్శించిన, ఉత్తమ సేవలందించిన వృత్తిపరమైన వైద్యులను అవార్డులతో సత్కరించాలనుకుంటున్నది.

హైదరాబాద్‌లోని మేరియట్ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా డీఎన్‌బీ గుర్తింపు ఉన్న వైద్యులకు ఆహ్వానాన్ని పంపింది. మొదటి ఈవెంట్ సందర్భంగా పలువురు వైద్యులను సత్కరించిన ఈ సంస్థ ఈసారి రెండో ఈవెంట్ నిర్వహిస్తున్నది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యులను ఆహ్వానిస్తున్నది. ఆధునిక వైద్యరంగంలో నిస్వార్ధ సేవలందించిన డాక్టర్లను గుర్తించి అవార్డులతో సత్కరించడం వారిని మరింతగా ప్రోత్సహించడానికేనని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బి.బాలరాజు తెలిపారు. ప్రతీ ఏటా జాతీయ అక్రెడిషన్ బోర్డు, కేంద్ర ఏఎన్‌బీఏఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, తెలుగు రాష్ట్రాలకు విడిగా నిర్వహిస్తున్నామని వివరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed