- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మవా రాతి బొమ్మవా : కూతుర్ని నేలకేసి కొట్టి.. గొంతుమీద కాలేసి తొక్కి
<p>దిశ,వెబ్‌డెస్క్: కన్నతల్లే కన్న బిడ్డపై కర్కశం ప్రదర్శించింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డపై తన ప్రతాపం చూపించింది. లోకం పోకడ తెలియని ఆ చిన్నారి.., తల్లి చేసిన పనికి ఇంకా షాక్ నుంచి తేరుకోవడం లేదు. పిల్లలు మారం చేస్తే ఏ తల్లిదండ్రులైనా బుజ్జగిస్తారు, అయినా వినకపోతే కన్నెర్రజేస్తారు లేదంటే ఒక దెబ్బ వేస్తారు. ఇది కామన్. కానీ ఈ తల్లి మాత్రం కన్నబిడ్డను వదిలించుకోవడం కోసం ఏకంగా చిత్రహింసలకు గురిచేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో […]</p>

దిశ,వెబ్‌డెస్క్: కన్నతల్లే కన్న బిడ్డపై కర్కశం ప్రదర్శించింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డపై తన ప్రతాపం చూపించింది. లోకం పోకడ తెలియని ఆ చిన్నారి.., తల్లి చేసిన పనికి ఇంకా షాక్ నుంచి తేరుకోవడం లేదు. పిల్లలు మారం చేస్తే ఏ తల్లిదండ్రులైనా బుజ్జగిస్తారు, అయినా వినకపోతే కన్నెర్రజేస్తారు లేదంటే ఒక దెబ్బ వేస్తారు. ఇది కామన్. కానీ ఈ తల్లి మాత్రం కన్నబిడ్డను వదిలించుకోవడం కోసం ఏకంగా చిత్రహింసలకు గురిచేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో మూడేళ్ల చిన్నారిని తల్లి పైకెత్తి, నేలకేసి కొట్టి.. గొంతుమీద కాలేసి తొక్కుతుంటే స్థానికులు మాత్రం సినిమా చూస్తున్నట్లుగా ఉండిపోవడం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. 2019 ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేసిన వివరాల ప్రకారం.., మనదేశానికి చెందిన ఓ ప్రాంతంలో జరిగిన దారుణమని తెలుస్తోంది. ఓ తల్లి చాలాసేపు చిన్నారిని చావబాదింది. బంతిలా చిన్నారిని పైకెత్తి నేలపైకి కొట్టింది. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న చిన్నారిని వెంబడించి మరీ హింసించింది. మెడపై కాలేసి తొక్కుతూ కనికరం లేకుండా ప్రవర్తించింది. దీంతో అమ్మ పెట్టే బాధ భరించలేని చిన్నారి అరవడం హృదయాన్ని కలిచివేస్తుంది. కానీ ఇంత జరుగుతున్నా ఆమెను ఆపడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వీడియోలో కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి సదరు మహిళను చెప్పుతో కొట్టాడు.
కాగా ఐఏఎస్ అధికారి అవనీష్ వీడియోపై స్పందించారు. వీడియోలో మూడేళ్ళ చిన్నారిని కొడుతున్న ఆ తల్లి ఇప్పుడు జైల్లో ఉంది. అది ఓకే కానీ, ఆ పసిబిడ్డను హింసిస్తుంటే అక్కడున్నవారంతా ఏం తమాషా చూస్తున్నారో అనేదే ఆశ్చర్యంగా ఉందని విచారం వ్యక్తం చేశారు.
वीडियो में 3 साल की बच्ची की पिटाई करने वाली यह माँ अभी थाने में है. लेकिन बड़ा सवाल यह है कि वहाँ इतने सारे लोग क्या तमाशा देख रहे थे. 🥲 pic.twitter.com/knS5GMlcJI
— Awanish Sharan (@AwanishSharan) March 13, 2021






