- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Scooter: రూ.74 వేలకే 62 కి.మీ మైలేజ్.. ఈ సూపర్ స్కూటర్ ఫీచర్స్ అదుర్స్
Scooter: ధర తక్కువ..మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం సెర్చ్ చేస్తున్నారా

దిశ,వెబ్ డెస్క్: Scooter: ధర తక్కువ..మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు టీవీఎస్ అందిస్తోంది స్కూటీ జెస్ట్ 110. స్టైలిష్ డిజైన్ తో సిటీలో తిరిగేందుకు కంఫర్టబుల్ గా ఉండే విధంగా టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ ను తయారు చేసింది. దీని ఫీచర్స్, మైలేజీ, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టీవీఎస్ కంపెనీ నుంచి చాలా రకాల బెస్ట్ వెహికల్స్ ఎన్నో మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. పలు వర్గాల ప్రజలకు అవసరమైన వెహికల్స్ ను టీవీఎస్ అందించింది. మహిళలకు, యువతకు, ఫ్యామిలీ మెన్ కు, పెద్ద వాళ్లకు ఇలా ఎన్నో రకాల కేటగిరీల్లో డిఫరెంట్ మెడల్స్ ను తీసుకువచ్చింది. తాజాగా లాంచ్ చేసిన స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ మాత్రం సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. తేలికైన, స్టైలిష్ డిజైన్ తో మంచి మైలేజ్ ఇస్తుంది. మీరు స్టూడెంట్ అయినా, ఉద్యోగం చేసేవారైనా, సింపుల్ గా రైడ్ చేయాలనుకుంటే ఈ స్కూటర్ ఫర్పెక్టుగా ఉంటుంది. దీని డిజైన్, కంఫర్టబుల్ సీటు వల్ల జర్నీ మరింత సాఫీగా ఉంటుంది.
స్కూటీ జెస్ట్ 110లో 109.7సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 7,500ఆర్పిఎం వద్ద 7.8 పీఎస్ పవర్,5,500 ఆర్పిఎం వద్ద 8.8ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 62కి.మి. ట్రాఫిక్ లో వెళ్లడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. స్కూటీ జెస్ట్ 110 స్టైలిష్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ స్కూటర్ డిఫరెంట్ కలర్స్ లోనూ లభిస్తుంది. దీనిలో 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ ఇంకా కంఫర్టబుల్ రైడ్ కోసం బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి. దీని సీటు ఎత్తు 760ఎంఎం మాత్రమే. ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 74,000.






