- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Toyota : తొలి EV కారును ఆవిష్కరించిన టయోటా..ఏకంగా 543 కిమీ
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ( Toyota Urban Cruiser Ebella ) పేరుతో ఈ కారును తీసుకువచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దాని ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్న నేపథ్యంలో, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కూడా కంపెనీలు తీసుకువస్తున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ప్రొడక్షన్ కూడా అవుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే టయోటా తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ( Toyota Urban Cruiser Ebella ) పేరుతో ఈ కారును తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కంపెనీ. దీంతో ఈ కొత్త కారు ఫోటోలు వైరల్ గా మారాయి.
తొలి ఎలక్ట్రిక్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కారు ఫీచర్లు ఇవే
టయోటా తీసుకువచ్చిన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కారు 543 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందట. 61 kwh బ్యాటరీ ఉన్న కారు ఈ రేంజ్ లో మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే 49 kwh ఉన్న ఎలక్ట్రిక్ కారు 440 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వివరించింది. అంటే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మైలేజ్ లో తేడా ఉంటుంది. అలాగే 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ చార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్ కూడా అందిస్తున్నారు. ఇంటీరియర్ లో సన్ రూఫ్ కూడా కంపెనీ అందిస్తోంది. ఎల్ఈడి DRL, హెడ్ లాంప్స్, అందిస్తున్నారు. ఈ కారు ఒకసారి ఫుల్ చార్జింగ్ కావాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతుంది. 189 nm టార్క్ కూడా రిలీజ్ కానుంది. ఇక అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కారు ధర ఇంకా ప్రకటించలేదు కంపెనీ. కానీ ఈ కారు ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్చ ఉండే ఛాన్సు ఉంది.






