- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్-5 రీ-సేల్ కార్లు ఇవే..5 ఏళ్లు వాడినా అదిరిపోయే రేటు !
మారుతి స్విఫ్ట్, వాగనార్, టాయోటా, హోండా సిటీ లాంటి కార్లకు రీసేల్ లోనూ ఎక్కువ ధర పలుకుతాయి.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఒకప్పుడు సైకిలు ఉంటే గొప్పవాళ్ళు అనేవారు. కానీ కాలక్రమమైన అది మారి ఇంటికో బైక్.. ప్రస్తుత కాలంలో ఇంటికో కారు అన్నట్లుగా వ్యవహారం మారిపోయింది. కార్లు కూడా ఐదు లక్షల లోపే వచ్చేస్తున్నాయి. దీంతో జనాలు కూడా టూ-వీలర్ వాహనాలను కాదని కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంత మంది లక్షలకు లక్షలు పెట్టి కార్లు కొంటారు. కానీ వాటికి రీసేల్ తక్కువ. కానీ కొన్ని కార్లకు రీసేల్ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. ఈ తరుణంలో టాప్ 5 రీసేల్ కార్ల వివరాలు పరిశీలిద్దాం.
టాప్ 5 రీసేల్ కార్లు వే
మిడిల్ క్లాస్ జనాలు ఎక్కువగా మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లను కొనుగోలు చేస్తారు. అందులో వాగన్ ఆర్ ఒకటి. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంది. ఈ కారును నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు వాడి.. విక్రయిస్తే కూడా మంచి ధర వస్తుంది. ఈ కారును రీసేల్ చేస్తే నాలుగు లక్షల వరకు సులభంగా వస్తుంది. అలాగే మారుతి షిఫ్ట్ కూడా ఈ కోవాలోకి వస్తుంది. ఈ కారు ధర ఆరు లక్షల నుంచి 8.65 లక్షల వరకు ఉంటుంది. దీనిని ఐదు సంవత్సరాలు వాడి, విక్రయిస్తే నాలుగు లక్షలకు పైగానే వస్తుంది.
కాబట్టి కస్టమర్ ఎప్పుడు కూడా నష్టపోడు. ఇక హుందాయ్ క్రెటా కారు ఎక్స్ షోరూం ధర 10 లక్షల పైన ఉంది. దీన్ని మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వాడి విక్రయించినప్పటికీ కూడా తొమ్మిది లక్షల వరకు వస్తుంది. హోండా సిటీ కారు 12 లక్షల వరకు ఉంది. దీనిని ఐదు సంవత్సరాలు వాడి, విక్రయించినా కూడా ఏడు లక్షలకు పైగా సులభంగా సంపాదించుకోవచ్చు. టయోటా ఇన్నోవా క్రిస్టా ధర 19 లక్షలకు పైగా ఉంటుంది. ఈ కారును ఐదు సంవత్సరాలు వాడుకొని విక్రయించిన కూడా 14 లక్షల పైగా సులభంగా సంపాదించవచ్చు






