- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెస్లా కొత్త కారు వచ్చేసింది..సింగిల్ ఛార్జ్‌తో 681 కిలోమీటర్ల రేంజ్
కిందటి ఏడాది Y మోడల్ తీసుకు వచ్చిన టెస్లా, ఇప్పుడు Y L పేరుతో మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల కార్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే, ఎలక్ట్రిక్ కార్లు భారీ స్థాయిలో ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా అమెరికాకు సంబంధించిన టెస్లా, ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త కారును తీసుకువచ్చింది. కిందటి ఏడాది Y మోడల్ తీసుకు వచ్చిన టెస్లా, ఇప్పుడు Y L పేరుతో మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఈ మోడల్ ను ఇప్పటికే చైనాలో విడుదల చేసిన టెస్లా, కానీ అమెరికాలో ఇప్పటికీ లాంచ్ చేయలేదు. నేరుగా ఇండియాకు తీసుకువచ్చింది. ఈ కారులో సిక్స్ సీటర్ కెపాసిటీ ఉంటుంది.
టెస్లా Y L మోడల కారు ఫీచర్లు
16 అంగుళాల టచ్ స్క్రీన్ డాష్ బోర్డు కలిగి ఉన్న ఈ టెస్లా కారు, 5 సెకండ్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ 201 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 681 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 19 స్పీకర్ సౌండ్ సిస్టం, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్స్ అందిస్తున్నారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ కారు ధర 61.99 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. అంటే ఓ కస్టమర్ కొనుగోలు చేస్తే, అన్ని టాక్సులు కలుపుకుని రూ.75 లక్షలు దాటే ఛాన్స్ ఉంది.






