- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Second Hand Bike: సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా.? ఈ విషయం తెలుసుకోకుంటే జైలుకు వెళ్లడం ఖాయం
Second Hand Bike: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?

దిశ, వెబ్ డెస్క్, Second Hand Bike: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ బైక్ గురించి కేవలం ఆర్ సి, పొల్యూషన్ సహా ఇతర డాక్యుమెంట్లు చెక్ చేస్తే సరిపోదు ఆ బైక్ పై ఉన్న ఇతర వివరాలను కూడా మీరు తెలుసుకున్నట్లయితేనే ఆ బైకును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఉన్న వీడియోలో పేర్కొన్నట్టు మీరు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేస్తున్నట్లయితే దానిపైన ఉన్న కేసులు అదేవిధంగా ఇతర వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం CCTNS వెబ్‌సైట్ (Crime and Criminal Tracking Network and Systems) మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు ఆ బైక్ స్టేటస్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది.
కొన్ని సందర్భాల్లో దొంగతనం చేసిన బైకులను కూడా మీకు అంట గడుతుంటారు. అలాంటి సమయంలో CCTNS పోర్టల్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ పోర్టల్ ఉపయోగించి బైక్ స్టేటస్ కనుక్కోవడం చాలా సులభమైన విషయం అని చెప్పవచ్చు. ముందుగా www.cctns.gov.in ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందులో ‘Lost/Stolen Vehicle Search’ లేదా ‘Verify Vehicle’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తరువాత ఓపెన్ అయిన వెబ్ పేజీలో అవసరమైన వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా చాసిస్/ఎంజిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పడు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు వాహనం గురించి పూర్తి వివరాలు వస్తాయి. ఒక్కోసారి అది దొంగతనం చేసిన వెహికల్ అయినట్లయితే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలు కూడా మీకు నమోదు అవుతాయి.
అందుకే సెకండ్ హ్యాండ్ బైక్ చెక్ చేసేటప్పుడు కచ్చితంగా CCTNS వెబ్ పోర్టల్ ఉపయోగించి దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం అనేది తప్పనిసరి. దీంతోపాటు Registration Certificate సరిగా ఉందా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌షూరెన్స్ పత్రాలు వాలిడ్‌గా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు PUC (Pollution Under Control) సర్టిఫికెట్ ఉందా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మీరు కొనే వాహనంపైన బ్యాంకు ఫైనాన్స్ ఉన్నదా చెక్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒక మెకానిక్ ద్వారా మీరు బండి మొత్తం చెక్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీరు వాహనం కొనుగోలు చేసినట్లయితే మీరు డబ్బుకు తగిన విలువైన బండిని పొందే అవకాశం ఉంటుంది.






