Citroen Aircross X: బ‌డ్జెట్ లో అదిరిపోయే 5 స్టార్ రేటింగ్ కారు..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

ఎయిర్ క్రాస్ X పేరుతో ఈ కారును లాంచ్ చేశారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ కార్లు 8.29 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.

Citroen Aircross X: బ‌డ్జెట్ లో అదిరిపోయే 5 స్టార్ రేటింగ్ కారు..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జిఎస్టి తగ్గుముఖం పట్టిన తర్వాత.. చాలా కార్ల ధరలు తగ్గాయి. దీంతో కస్టమర్లు కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కారు వచ్చేసింది. సిట్రోయెన్ కంపెనీ ఇండియాలోకి మరో కొత్త కారు తీసుకువచ్చింది. ఎయిర్ క్రాస్ X పేరుతో ఈ కారును లాంచ్ చేశారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ కార్లు 8.29 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.

ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. ఎయిర్ క్రాస్ X 5 సీట్ల‌తో తో పాటు 7 గురు కూర్చోనేలా ఎస్‌యూవీలు కూడా తీసుకువ‌స్తున్నార‌ట‌. ఈ కారుకు 7 అంగుళాల డిజిటల్ క్లస్టర్ అలాగే 10. 25 అంగుళాల ఇన్ఫో టైం మెంట్ సిస్టం అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు కూడా అందిస్తున్నారు. ఈ కారు క్యాబిన్ లో వెంటిలేటెడ్ లేథరేట్ సీట్లు ఉండనున్నాయి. 360 డిగ్రీ కెమెరా కూడా అందిస్తున్నారు. ఎల్ఈడి ఫాగ్ లాంప్లు , నావిగేటెడ్ రూట్ ఉండే అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ కారు బుకింగ్స్ ప్రారంభం కాగా.. త్వ‌ర‌లోనే డెలివ‌రీలు ప్రారంభం కానున్నాయి.

Next Story