- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు బిగ్ షాక్...పెరగనున్న మారుతీ కార్ల ధరలు!
త్వరలోనే మారుతి కార్ల ధరలు పెరుగనున్నాయి. తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందనిమారుతి సుజుకి తాజాగా అధికారిక ప్రకటన చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: కొత్త కార్లు కొనుగోలు చేసేవారికి ఊహించని షాక్ తగిలింది. త్వరలోనే మారుతీ కార్ల ధరలు పెరుగనున్నాయి. తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకి తాజాగా అధికారిక ప్రకటన చేసింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కమొడిటీ ధరలు విపరీతంగా పెరిగాయని వెల్లడించింది. గతేడాది జీఎస్టీ తగ్గింపు కారణంగా వచ్చిన లాభాలు తుడిచి పెట్టుకుపోయాయని కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకి స్పష్టం చేసింది. ఈ కార్ల తయారీలో వాడే ఆయిల్, గ్యాస్ సహా కీలక లోహాల ధరలు కూడా పెరిగినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు సప్లై లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ...రాబోయే రోజుల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది మారుతీ సుజుకి. ఇక అటు పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది.
Next Story






