రూ.2,50,000లతో ఈ వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50వేలు సంపాదించండి!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-30 13:33:23  IST  )

చాలా మంది తక్కువ డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. కానీ ఏ వ్యాపారం చేయాలో అర్థం కాదు. అంతే కాకుండా లాభాలు వస్తాయా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే కేవలం రూ.2,50,000లతోనూ ఓ వ్యాపారం ప్రారంభించవచ్చు.

రూ.2,50,000లతో ఈ వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50వేలు సంపాదించండి!
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది తక్కువ డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. కానీ ఏ వ్యాపారం చేయాలో అర్థం కాదు. అంతే కాకుండా లాభాలు వస్తాయా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే కేవలం రూ.2,50,000లతోనూ ఓ వ్యాపారం ప్రారంభించవచ్చు. దీని ద్వారా నెలకు రూ.50వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ మార్కెటింగ్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయాలంటే కొరియర్, లాజిస్టిక్స్ కంపెనీలు ఉండాలి.

ఇవి వస్తువుల తయారీతో సంబంధం లేకుండా కేవలం డెలివరీ మాత్రమే చేస్తాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు దాదాపు 200 నుండి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇల్లు సరిపోతుంది. ఫ్రాంచైజ్ కోసం పదివేల నుండి యాభైవేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా రెండు కంప్యూటర్లు లేదా ల్యాప్ టాప్‌లు అవసరం అవుతాయి.

కంపెనీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ లాజిస్టిక్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి, వస్తువులను ట్రాక్ చేయడానికి కంప్యూటర్లు తప్పకుండా ఉండాలి. బిజినెస్ ఎలా చేయాలి డెలివరీలు ఎలా చేయాలి అనే విషయాలను కంపెనీనే మీకు నేర్పిస్తుంది. మీరు డెలివరీ చేస్తే వస్తువుల ఆధారంగా ప్రతి నెలా కంపెనీ లాభాల్లో నుండి మీకు వాటా ఇస్తుంది. ఈ కామర్స్ పార్సిళ్లకు కేజీకి రూ.30 చోప్పున పార్సిల్ బరువును బట్టి పరిమాణం బట్టి ఛార్జీలు ఉంటాయి. ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేయడం, ఎక్కువ బరువు ఉన్న ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా మీరు ప్రతినెలా రూ.40 నుండి రూ.50వేల వరకు సంపాదించవచ్చు.

Next Story