- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ బజాజ్ బైక్ పై రూ.37 వేల డిస్కౌంట్..ధర, ఫీచర్స్ ఇవే
బజాజ్ కు సంబంధించిన డొమినార్ బైక్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్: బజాజ్ ( Bajaj ) కంపెనీకి సంబంధించిన వాహనాలు మార్కెట్ లో భారీగానే విక్రయాలు జరుపుకుంటాయి. తక్కువ ధరలో, క్వాలిటీ వాహనాలు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మైలేజ్ ఎక్కువ ఇచ్చే, వాహనాలను తీసుకువస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్ జనాలు కూడా బజాజ్ కు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బజాజ్ మరో కీలక ప్రకటన చేసింది. ఏకంగా రూ. 37 వేల డిస్కౌంట్ ప్రకటించింది.
బజాజ్ డొమినార్ పై బంపర్ ఆఫర్
బజాజ్ కు సంబంధించిన డొమినార్ బైక్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ బైక్ పైన దాదాపు 37 వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవంగా ఈ బైక్ ధర రూ. 2.30 లక్షలు. ఇది ఎక్స్ షోరూం ప్రకారం మాత్రమే. అయితే డిస్కౌంట్ పోగా ఈ బైక్ రూ. 1.93 లక్షలకు ఈ బైక్ అందుబాటులోకి వస్తుందన్నమాట. 400 సీసీ ఇంజిన్ ఉన్న ఈ బైక్ ఇంత తక్కువ ధరలో రావడంతో జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
బజాజ్ డొమినార్ ఫీచర్స్
బజాజ్ డొమినార్ బైక్ కు 400 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. 40 PS పవర్, 35NM టార్క్ రిలీజ్ చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. అప్ సైడ్ డౌన్ పోర్క్స్, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ వెల్లడించడంతో.. చాలామంది బుకింగ్స్ చేసుకుంటున్నారు.






