షియోమీ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. సింగిల్‌ చార్జింగ్‌తో 835 కిలోమీటర్లు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-25 09:36:52  IST  )

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షియోమీ (Xiaomi), ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో తన స్థానాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది.

షియోమీ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. సింగిల్‌ చార్జింగ్‌తో 835 కిలోమీటర్లు
X

దిశ, వెబ్ డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షియోమీ (Xiaomi), ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో తన స్థానాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి మోడల్‌ ఎస్‌యూ7 (SU7)కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించగా, ఇప్పుడు మరో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వైయూ7 (YU7) పేరుతో విడుదలైన ఈ కారు డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఎలక్ట్రిక్‌ కార్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 835 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం 12 నిమిషాల్లో పది శాతం నుంచి 80 శాతం చార్జింగ్ అవుతుంది. కేవలం 15 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే సుమారు 620 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు.

ఇక ఇందులో 96.3 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. కేవలం 3.23 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్‌ గంటకు 253 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే గరిష్ట రివల్యూషన్ ను 22,000 ఆర్ పీఎంకు పెంచారు. 528 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. దీనిలోని డ్యూయల్ మోటారు ఫోర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ద్వారా గరిష్టంగా 680 బీహెచ్ పీ హార్స్ పవర్, 508 కేడబ్ల్యూ గరిష్ట శక్తి పొందుతుంది. దీంతో కారు పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ప్రస్తుత మార్కెట్‌‌లో టెస్లా (Tesla) కంపెనీకి చెందిన మోడల్‌ వై (Model Y)కి గట్టి పోటీగా భావిస్తున్నారు. ఇక ఈ కారు విడుదల చేసిన 27 నిమిషాల్లోనే 50 వేల ఆర్డర్లు వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ కార్ల ద్వారా భారతదేశంలోని ఎలక్ట్రిక్ మార్కెట్‌లో తన వాటా పెంచుకోవాలని షియోమీ భావిస్తోంది. కాగా, షియోమీ ఇప్పటికే విడుదల చేసిన ఎస్‌యూ7 సెడాన్‌ (SU7 Sedan) మోడల్‌కి మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు 2.58 లక్షల యూనిట్లు విక్రయమైనట్టు సంస్థ ప్రకటించింది.

Next Story