Viral video: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. ధర ఎంతంటే?

by Yella Dhawani Reddy |

రోడ్డెక్కింతే చాలు.. కార్లు, బైకులతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య (Traffic problem) వేధిస్తోంది.

Viral video: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డెక్కింతే చాలు.. కార్లు, బైకులతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య (Traffic problem) వేధిస్తోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అయితే కొద్దిపాటి దూరం ప్రయాణించాలన్నా గంటలు గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో మనలో చాలా మందికి గాల్లో నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుండు అనిపిస్తుంటుంది. అయితే, అలా వారికోసం ఇప్పుడు ఎగిరే కారు (Flying car) అందుబాటులోకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral in Social media) అవుతోంది. మరీ పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

అమెరికాకు చెందిన ఆటోమోటివక & ఏవియేషన్ సంస్థ 'అలెఫ్ ఏరోనాటిక్స్' ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును రూపొందించింది. తాజాగా కాలిఫోర్నియాలోని రహదారులపై ఈ ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించింది. ఈ కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి తన ఎదురుగా ఉన్న మరో వాహనం పై నుంచి జంప్ చేసింది. ఈ ఇందుకు సంబంధించిన వీడియోను సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ట్రాఫిక్ నుంచి తప్పించుకునేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది.

ఇక ఈ కారు ధర 300,000 డాలర్లు కాగా 150 డాలర్లు డిపాజిట్ చేసి దీనిని బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 3000 కార్లు ప్రీ బుక్ అయినట్లు చెప్పింది. 200 మైళ్ల ఎగిరే రేంజ్, 400 మైళ్ల డ్రైవింగ్ రేంజ్‌తో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఇక 2035 నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

Next Story