బడ్జెట్‌లో కొత్త బజాజ్ అవెంజర్ లాంచ్, ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ను తీసుకువచ్చింది బజాజ్.

బడ్జెట్‌లో కొత్త బజాజ్ అవెంజర్ లాంచ్, ధ‌ర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో బజాజ్ కంపెనీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసుకొని మరి వాహనాలను లాంచ్ చేస్తోంది. లేటెస్ట్ గా బజాజ్ నుంచి మరో బైక్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. అప్డేట్ చేసిన అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ను ( Bajaj Avenger 220 Street) తీసుకువచ్చింది బజాజ్. ఇక కొత్తగా లాంచ్ అయిన ఈ బజాజ్ అవెంజర్ 220 బైక్ రెండు కలర్స్ లో లభిస్తుంది.

కాక్ టెయిల్, ఎబోనీ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో 220 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. 8500 ఆర్పీఎం వద్ద 19 హెచ్ పీ పవర్ జనరేట్ చేస్తుంది. 5 గేర్లు ఈ బైక్ కలిగి ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 13 లీటర్ల పెట్రోల్ ట్యాంకు కలిగి ఉన్న ఈ బైక్ బరువు 160 కేజీలు కావడం గమనార్హం. ఇక ఈ బైక్ ధర రూ.1.30 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే.

Next Story