సానుకూలంగా వాహన అమ్మకాలు!

by  |
సానుకూలంగా వాహన అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాది చివరి నెల డిసెంబర్‌లో ఆటో పరిశ్రమ అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. పండుగ సీజన్‌కు తోడు, ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో వాహన అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించాయి. దేశీయ దిగ్గజ వాహన సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2020, డిసెంబర్ అమ్మకాల్లో 2.68 శాతం వృద్ధితో 8,638 యూనిట్లను నమోదు చేసింది. అలాగే, దేశీయ మార్కెట్లలో మొత్తం 8,412 యూనిట్లను విక్రయించింది. ఎగుమతులు 713 యూనిట్లని కంపెనీ తెలిపింది.

టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) డిసెంబర్ దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధితో 7,487 యూనిట్లను విక్రయించింది. 2019, డిసెంబర్‌లో కంపెనీ మొత్తం 6,544 యూనిట్లను విక్రయించింది. త్రైమాసిక పరంగా చూస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్టు టీకేఎం వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ చెప్పారు.

హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2020, డిసెంబర్ మొత్తం అమ్మకాల్లో 33.14 శాతం వృద్ధి సాధించి 66,750 యూనిట్లను విక్రయించింది. 2019, డిసెంబర్‌లో మొత్తం 50,135 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ అమ్మకాలు 24.89 శాతం పెరిగి 47,400 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదిలో దేశీయ అమ్మకాలు 37,953 యూనిట్లు విక్రయించింది. 2020, డిసెంబర్‌లో ఎగుమతులు 58.84 శాతం పెరిగి 19,350 యూనిట్లకు చేరుకున్నాయి.

అశోక్ లేలండ్ సంస్థ డిసెంబర్‌లో అమ్మకాలు 14 శాతం పెరిగి 12,762 యూనిట్లను విక్రయించింది. 2019, డిసెంబర్‌లో మొత్తం 11,168 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. దేశీయ అమ్మకాలు 14 శాతం పెరిగి 11,857 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా మీడియం, హెవీ కమర్షియల్ వాహన అమ్మకాలు 6,175 యూంట్లు అమ్ముడయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 3 శాతం తక్కువని కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో లైట్-కమర్షియల్ వాహన అమ్మకాలు 42 శాతం పెరిగి 5,682 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Next Story

Most Viewed