ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు కారణం ఇదే!

by  |
ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు కారణం ఇదే!
X

దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం సరిగాలేని ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హుత్నూర మండలంలోని చింతలచెరువులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు మండలం కంచర్లగూడెం గ్రామానికి చెందిన గునుగుర్తి రవీందర్(28) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదు. సోమవారం ఉదయం ఆటో తీసుకొని చింతలచెరువు గ్రామ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లావణ్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఈ సత్యనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed