- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం
<p>దిశ, మహబూబాబాద్:మైనర్ బాలికపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు సినీ ఫక్కీలో ప్లాన్ చేశాడు. కామ కోరికలు తీర్చుకునేందుకు బాత్రూంలో పడిగాపులు కాచి చివరకు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓటాయి గ్రామానికి చెందిన కిరణ్ (26).. ఇదే గ్రామంలోని 13 ఏండ్ల బాలికపై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బాలిక ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లి దాచుకున్నాడు. ఇది తెలియని బాధితురాలు […]</p>

దిశ, మహబూబాబాద్:మైనర్ బాలికపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు సినీ ఫక్కీలో ప్లాన్ చేశాడు. కామ కోరికలు తీర్చుకునేందుకు బాత్రూంలో పడిగాపులు కాచి చివరకు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓటాయి గ్రామానికి చెందిన కిరణ్ (26).. ఇదే గ్రామంలోని 13 ఏండ్ల బాలికపై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బాలిక ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లి దాచుకున్నాడు. ఇది తెలియని బాధితురాలు బాత్రూంలోకి వెళ్లగా.. కిరణ్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయింది.
ఈలోపే బాలిక చేయిపట్టిలోపలికి లాగిన యువకుడు అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా కేకలు వేసిన బాధితురాలు బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై సురేష్ తెలిపారు.






