- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:వైసీపీ ఎంపీ అభ్యర్థి కారు పై దాడి..
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం రంగాపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

దిశ,ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం రంగాపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. జంగారెడ్డి గూడెంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ముసునూరు మండలంలో ప్రచారం చేసేందుకు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెళ్తున్న క్రమంలో రంగాపురం వద్ద టీడీపీ కార్యకర్తల ప్రచారం పూర్తి చేసి భోజనాలు చేస్తున్నారు. దీంతో సునీల్ కుమార్ తన కారును వెనక్కి తిప్పి వెళ్తుండగా కారు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో కారుమూరి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఆయన అన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేసి కారుమూరిని తిట్టారని, సునీల్ కుమార్ అంతు చూస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. దాడిని అడ్డుకోబోయిన వైసీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారని చెబుతున్నారు.






