మద్యం మత్తులో పంచాయతీ కార్యదర్శిపై దాడి

58

దిశ, డోర్నకల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండాలు తండాలో ఎండీ యాకూబ్ పాషా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన విధులకు హాజరై కార్యాలయంలో సర్పంచ్‌తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ధరవట్ చిరంజీవి అనే వ్యక్తి తాగి వచ్చి కార్యదర్శి, సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వారిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కార్యదర్శికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..