తప్పుడు సమాచారంతో ఎన్నికలు అడ్డుకున్నారు: అచ్చెన్న

63

దిశ, వెబ్‌డెస్క్: న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పంచాయతీ ఎన్నికలు అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయినా ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల మద్దతుంటే ఎన్నికల విషయంలో భయమెందుకు అన్న అచ్చెన్నాయుడు.. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలను భాగస్వాములు చేశారని ఆరోపించారు. కరోనా ఉంటే ‘అమ్మ ఒడి’ సభను ఎలా నిర్వహించారని ప్రశ్నించిన అచ్చెన్న.. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు జరిగితే తమ అరాచకాలు సాగవన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు.