కార్యక్రమంలో అపశృతి.. కిందపడ్డ అచ్చెన్నాయుడు, రామ్మోహన్

219
Acchem-Nayudu1

దిశ, ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం పట్టణం బాపూజీ కళామందిర్ లో డా” గౌతు లచ్చన్న గారిపై తపాలకవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రాంమోహన్ నాయుడు ఇద్దరు పాల్గొన్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు స్టేజ్ మీద సోపాలో కూర్చుంటుండగా ఒక్కసారిగా సోపా విరిగిపోయింది. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి పడిపాయారు. దీంతో వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కింద పడిపోయిన అచ్చెన్నాయుడిని, రామ్మోహన్ నాయుడిని పైకి లేపారు. సిబ్బంది అప్రమత్తమవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..