జైల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 41మంది మృతి

294
Fire Accident in kukatpally

దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా జాకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టాంగెంకాంగ్ జైలులో బుధవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో జైల్‌లో ఉన్న 41 ఖైదీలు సజీవదహనం అయ్యారు. మరో 39 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..