52 ఏళ్ల వయస్సులోనూ ‘జెన్నీ’ అందాల ఆరబోత.. 

by  |
jennifer-lopez
X

దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ జెన్నిఫర్ లోపెజ్‌కు ఏజ్ ఒక నంబర్ మాత్రమే. 52వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె ప్రపంచానికి మేజర్ ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేసింది. ఈ మధ్యే బాయ్ ఫ్రెండ్ బెన్ అఫ్లెక్‌తో రిలేషన్‌ను అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేసిన ఆమె.. బర్త్ డే రోజున ఎల్లో అండ్ రెడ్ బికినీలో హాట్ హాట్ పోజులిస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. అందుకు తగిన మల్టీకలర్ ష్రగ్‌లో హొయలు పోతున్న వీడియో షేర్ చేసింది. అంతేకాదు బాయ్‌ఫ్రెండ్‌తో డీప్ కిస్ పిక్స్ రిలీజ్ చేసిన జెన్నిఫర్.. హాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీల యాక్టర్స్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. తన హాట్‌నెస్‌కు ‘ఉఫ్‌…’ అంటున్న స్టార్స్.. ‘క్వీన్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. బాలీవుడ్ బ్యూటీస్ మలైకా అరోరా, అమృతా అరోరా, నీలమ్ కొఠారి లాంటి సెలబ్రిటీలు 52 ఏళ్ల వయసులో ఆమె ఫిట్ అండ్ హాట్‌నెస్‌కు సలామ్ కొట్టారు.

Follow Disha official Facebook page :https://www.facebook.com/dishatelugunews

Next Story

Most Viewed