ఉద్యోగుల తరలింపుకు సన్నాహాలు?

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కాసేపట్లో అమరావతిలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సమావేశంలో ఉద్యోగులకు పిలుపునివ్వనున్నట్టు తెలుస్తోంది. మే 31లోపు వైజాగ్‌కు ఉద్యోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేయనున్నట్టు అంచనాలున్నాయి. ఉద్యోగులను ముందుగా తరలించని పక్షంలో విద్యాసంవత్సరం ఆరంభంలో సమస్యలు వస్తాయని, ప్రధానంగా ఉద్యోగులు తమ పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు దొరకవనే అభ్యంతరం చెప్పవచ్చనే అంచనాల నేపథ్యంలో ఉద్యోగులను ముందుగానే [&hellip;]</p>

ఉద్యోగుల తరలింపుకు సన్నాహాలు?
X

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కాసేపట్లో అమరావతిలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సమావేశంలో ఉద్యోగులకు పిలుపునివ్వనున్నట్టు తెలుస్తోంది. మే 31లోపు వైజాగ్‌కు ఉద్యోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేయనున్నట్టు అంచనాలున్నాయి. ఉద్యోగులను ముందుగా తరలించని పక్షంలో విద్యాసంవత్సరం ఆరంభంలో సమస్యలు వస్తాయని, ప్రధానంగా ఉద్యోగులు తమ పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు దొరకవనే అభ్యంతరం చెప్పవచ్చనే అంచనాల నేపథ్యంలో ఉద్యోగులను ముందుగానే వైజాగ్ తరలించనున్నట్టు సమాచారం.

Tags: assembly executive committee meeting, amaravathi, employees

Next Story