అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఇకలేరు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-23 09:23:51  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ (86) కన్నుమూశారు. గౌహతిలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. Shri Tarun Gogoi Ji was a popular leader and a veteran administrator, who had years of political experience in Assam as well as the Centre. Anguished by his passing away. My [&hellip;]</p>

అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఇకలేరు
X

దిశ, వెబ్‌డెస్క్ : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ (86) కన్నుమూశారు. గౌహతిలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఆగస్టు 25న గొగోయ్ కరోనా బారిన పడగా, చికిత్స అనంతరం అక్టోబర్ 25న డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో నవంబర్ 2న ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు గౌహతి మెడికల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తరుణ్ గొగోయ్ 2001 నుంచి 2016 వరకు అస్సాంలో కాంగ్రెస్ పార్టీని మూడు సార్లు గెలిపించడమే కాకుండా, 15ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాగా, అస్సాం మాజీ సీఎం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.

Next Story