బయటపడ్డ మరో సెక్స్ రాకెట్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి

by  |
బయటపడ్డ మరో సెక్స్ రాకెట్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రాజ్ కుంద్రా కేసు ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో పోర్న్ రాకెట్ బయటపడడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తు‍న్న ఓ మోడల్‌ కమ్‌ నటిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకప్పుడు బిజీ మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితా దత్తా(30) సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గుర్తింపు తెచ్చుకోవడానికి బీ గ్రేడ్‌, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్‌ కంటెంట్‌ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ పాపులర్ అయ్యింది.

ఇక డబ్బు కోసం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారిపై ఆమె కన్ను పడింది. వారితో పరిచయాలు పెంచుకొని, వారికి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి పోర్న్ వీడియోలలో నటించేలా ఒత్తిడి చేస్తోంది. అలా చాలామంది యంగ్ మోడళ్లు ఆమె వలలో చిక్కుకొని పోర్న్ వీడియో లో నటిస్తూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు మోడల్స్ ను పోర్న్ లో నటించాలని ఒత్తిడి చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. అదే సమయంలో నందితా ఒక మోడల్ ని నగ్నంగా నటించాలని బెదిరిస్తూ ఉండడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆమెను అరెస్ట్ చేశారు. మరోవైపు డమ్‌ డమ్‌లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్‌ నేతృత్వంలో పోర్న్‌ షూటింగ్‌ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్ట్ లో హాజరుపరచనున్నారు

ఇక నందితా అరెస్ట్ మరోసారి పశ్చిమ బెంగాల్‌ లో సంచలనంగా మారింది. రాజ్ కుంద్రా కు ఈమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? లేక ఈ భారీ సెక్స్ రాకెట్ వెనక వేరే వారి హస్తం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed