- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపల్లి పోలీసులకు షాక్.. ఏఎస్ఐ మృతి
<p>దిశ,వెబ్‌డెస్క్ : పెద్దపెల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కమాన్ చౌరస్తాలో లారీకింద పడి ఏఎస్ఐ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కమాన్‌పూర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి మరణించింది. ఈమె జిల్లా కేంద్రంలో నివాసముంటుూ కమాన్ పూర్ పోలీస్టేషన్ పరిధిలో విధులునిర్వహిస్తుంది. కాగా గురువారం ఉదయం విధులకు వెళ్లే క్రమంలో వెనక నుంచి లారీ ఢీ కొంది. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : పెద్దపెల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కమాన్ చౌరస్తాలో లారీకింద పడి ఏఎస్ఐ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కమాన్‌పూర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి మరణించింది. ఈమె జిల్లా కేంద్రంలో నివాసముంటుూ కమాన్ పూర్ పోలీస్టేషన్ పరిధిలో విధులునిర్వహిస్తుంది. కాగా గురువారం ఉదయం విధులకు వెళ్లే క్రమంలో వెనక నుంచి లారీ ఢీ కొంది. దీంతో ఏఎస్సై భాగ్య లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తన కుమార్తె శిరీష స్వల్పంగా గాయాలు పాలైంది. గుజరాత్‌కు చెందిన లారీగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా ఈఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Next Story






