RGV : షాకింగ్: వర్మ చెంప పగులకొట్టిన అషూ.. తొడలు బాగున్నాయనడంతో ఫైర్(వీడియో)

by  |
RGV : షాకింగ్: వర్మ చెంప పగులకొట్టిన అషూ.. తొడలు బాగున్నాయనడంతో ఫైర్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వివాదాలు ఉన్న చోట ఆయన.. ఆయన ఉన్న చోట వివాదం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇటీవల రోజుకో వివాదాన్ని తలకెక్కించుకుంటున్న వర్మ పాపులారిటీ కోసం ఎవరినైనా ఇట్టే వాడేస్తాడు. ఆ వాడకంలో తనకున్న ఇన్నర్ ఇగోను అదే పనిగా సంతృప్తి పర్చుకోవటం ఆయనకున్న బలహీనతగా చెప్పుకోవాలి. ఇక తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి, ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అషూ రెడ్డి థైస్ ని పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసి వివాదాన్ని కొనితెచ్చుకున్న వర్మ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రోమోను రిలీజ్ చేసి మరో సంచలనాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ట్రోలింగ్ కి గురైంది.

RGV :పిచ్చెక్కిస్తున్న వర్మ ట్విట్టర్ వీడియో.. కుర్ర కారుకు ఇక పూనకాలే

నర్సులు, యువతులతో పాస్టర్ రాసలీలలు.. చర్చిలో అలా చేస్తుండగా

ప్రోమో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్ అని టైటిల్ పెట్టి ప్రోమో రిలీజ్ చేసిన వర్మ వీడియోలో అషూ రెడ్డి అందాలకు ఫిదా అయినట్లు కనిపించాడు. 1.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో ఒక కేఫ్ లో అషూ రెడ్డి కూర్చొని ఉండగా.. వర్మ రావడం.. ఆమెను చూసి ఫిదా అవడం, అతని గురించి చెప్పడం, వర్మ ఎవరో తెలియదన్నట్లు అషూ రెడ్డి మాట్లాడడం వంటివి చూపించారు. ఇక చివరగా వర్మ నిజాయితీగా చెప్పాలంటే.. నీ తొడలు బాగున్నాయంటూ డైరెక్టుగా చెప్పడం.. ఆ మాటకు ఆగ్రహించిన అషూ ఒక ఇంగ్లీష్ బూతుమాటను అలవోకగా అనేసి ముందువెనక చూడకుండా వర్మను చెంపదెబ్బ కొట్టేయంతో ప్రోమో పూర్తయింది. పవన్ బర్త్ డే సందర్భంగా అషూ రెడ్డి ఇచ్చిన గిప్టు అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలివితేటలు చూపించాడు. వర్మ ఆశించినట్లుగానే ఈ ప్రోమో వైరల్ గా మారటం.. అందరి కంట్లో పడటమే కాదు.. ఘాటు విమర్శలు కూడా అందుకుంటుంది.

ఏమయ్యా వర్మ.. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడం ఎందుకు..? అలా చెంపలు పగిలేలా కొట్టించుకోవడం ఎందుకు అని కొందరు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఒక్కసారి కాళ్ల మీద పడతావ్.. ఇంకోసారి కళ్లకు పని చెప్తావ్ అని మరికొందరు.. ఇలాంటి పని చేస్తే అలాంటి దెబ్బలే పడతాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ కు రిప్లై ఇస్తూ వర్మ కౌంటర్ వేయడం గమనార్హం. ఈ ప్రోమో చూసిన డుంబోలందరికీ అషూ ప్రోమోలో చెంపదెబ్బ కొట్టడం జోక్ గా జరిగిందని అర్ధం కావడం లేదా..? అని కౌంటర్ వేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 7 న విడుదల కానుంది.

Follow Disha daily Official Facebook page: https://www.facebook.com/dishatelugunews

Next Story