‘డబుల్ డెక్కర్’ను దక్కించుకున్న కంపెనీ ఇదే..

by  |
Double Decker Bus
X

దిశ, వెబ్‌డెస్క్ : దశాబ్ధంన్నర క్రితం హైదరాబాద్ ఐకాన్ గా ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ నగరంలో పరుగులు తీయనున్న విషయం తెలిసింది. వీటిని అతి త్వరలో రోడ్డు ఎక్కించేందుకు టీఎస్ ఆర్టీసీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలు కోసం అధికారులు జనవరిలో టెండర్లు కూడా పిలిచారు. అయితే బస్సుల మాన్యుఫాక్చర్, మోడిఫికేషన్‌కి టైమ్ పట్టేలా ఉండడంతో టెండర్లు వేసిన కంపెనీలు 150 రోజులు గడువు కోరాయి. దీంతో టెండర్ల గడువును అధికారులు పెంచారు.

కాగా, టెండర్ల దాఖలు గడువు ముగియడంతో ఆర్టీసీ అధికారులు టెండర్లను తెలిచారు. వీటిల్లో అశోక్ లేలాండ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. ఆ సంస్థ మొదటి విడతగా 25 డబుల్ డెక్కర్ బస్సులను అందించనుంది. టెండర్లపై ఆర్థిక శాఖ చర్చించి ఆమోద ముద్ర వేసిన వెంటనే ఆ సంస్థ బస్సుల తయారీని ప్రారంభించనుంది. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా నాన్ ఏసీ డబుల్ డెక్కర్లను సంస్థ తయారు చేయనుంది. అన్నీ కుదిరితే దసరా రోజు ఈ డబుల్ డెక్కర్ భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టనుంది. ఇప్పటికే అధికారులు ఐదు రూట్లలో తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాగా ఈ బస్సుల రాకకోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తోంది.



Next Story

Most Viewed