'జీఎస్టీ తగ్గించడం, తుక్కు పాలసీలే కీలకం'!

by  |
జీఎస్టీ తగ్గించడం, తుక్కు పాలసీలే కీలకం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశంలో వాణిజ్య వాహనాల పరిశ్రమ ఎంతో కీలకమైనది. దేశానికి ఇది చాలా ప్రధానమైన పరిశ్రమ. ఈ పరిశ్రమపై పడుతున్న అధిక పన్ను గురించి గతంలోనూ, ఇప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అలాగే, తాము సూచించే అంశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీ విపిన్ సొంధి తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు తుక్కు పాలసీని సైతం ప్రభుత్వం ప్రకటించగలిగితేనే ఆటోమొబైల్ రంగం తొందరగా కోలుకునే పరిస్థితి ఉందని ఆయన సూచించారు. కరోనాకు ముందు మందగమనం, వ్యాప్తి తర్వాత ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు. తాము సూచించిన రెండు అంశాలను అమలు జరిపితే మార్పు తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. వాణిజ్య వాహనాల పరిశ్రమకు మళ్లీ డిమాండ్ పెంచుతాయన్నారు. ప్రతి త్రైమాసికం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని, దానికి మేము సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. వాహనాలపై జీఎస్టీనీ 18 శాతానికి తగ్గించాలన్నారు. ప్రస్తుతం ఈ వాహనాలపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. అలాగే, ఇన్సెంటివ్ ఆధారిత తుక్కు పాలసీ తీసుకురావాలని ఆటోమొబైల్‌ను పరిశ్రమకు చెందిన సియామ్ కోరింది. ప్రభుత్వం, తుక్కు పాలసీపై పనిచేస్తోందని, అయితే ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ రేట్లను తగ్గించడం గురించి పరిశీలించాలని సూచించారు.


Next Story