- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశోక్ గజపతిరాజు జైలుకెళ్లడం ఖాయం : విజయసాయిరెడ్డి
<p>దిశ, ఏపీ బ్యూరో : మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్ గజపతిరాజు అంటూ ఆరోపించారు. విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదని హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్ గజపతిరాజు అంటూ ఆరోపించారు. విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదని హెచ్చరించారు.
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారని అది ఒకప్పుడని ఇప్పుడు కాదన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాల భూములు కాజేశారని ఆరోపించారు. టీడీపీ నేతల భూ దందాపై చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టేలు తెచ్చుకోవచ్చనని.. కానీ అంతిమంగా విజయం తమదేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Next Story






