మాన్సాస్ ట్రస్ట్‌లో మరో లొల్లి.. హైకోర్టుకు చైర్మన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-07-24 05:59:24  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోసారి కోర్టుమెట్లెక్కింది. మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తనకు సహరించడంలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్ట్ ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం [&hellip;]</p>

మాన్సాస్ ట్రస్ట్‌లో మరో లొల్లి.. హైకోర్టుకు చైర్మన్
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోసారి కోర్టుమెట్లెక్కింది. మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తనకు సహరించడంలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్ట్ ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Next Story