భార్యపై హీరో పొగడ్తల వర్షం..లేడీ ఓరియంటెడ్ మూవీ కన్ఫర్మ్

by  |
భార్యపై హీరో పొగడ్తల వర్షం..లేడీ ఓరియంటెడ్ మూవీ కన్ఫర్మ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ఆర్య, సయేషా సైగల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్న ఈ జంట తాజాగా ‘టెడ్డీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ నెల 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మూవీ రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సయేషాపై పొగడ్తల వర్షం కురిపించారు ఆర్య. సయేషా కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటుందని, ఎన్ని ఆఫర్లు వచ్చినా అందులో మ్యాటర్ లేదంటే రిజెక్ట్ చేస్తుందని తెలిపారు.

‘టెడ్డీ’ సినిమాకు తనను రెఫర్ చేయలేదని, దర్శకుడు శక్తి తను ఈ క్యారెక్టర్‌కు యాప్ట్ అవుతుందనే ఎంచుకున్నారని తెలిపారు ఆర్య. కేవలం మీనింగ్ ఫుల్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న సయేషాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ఆర్య. నిర్మాతగా మారి తనతో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు ఆర్య. మంచి స్క్రిప్ట్ వస్తే మూవీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.



Next Story

Most Viewed