‘ఎనిమీ’ షూటింగ్‌లో గాయపడ్డ హీరో ఆర్య

by  |
‘ఎనిమీ’ షూటింగ్‌లో గాయపడ్డ హీరో ఆర్య
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. బెస్ట్ ఫ్రెండ్స్ విశాల్, ఆర్య మల్టీస్టారర్ మూవీ ‘ఎనిమీ’ కోసం యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. అయితే డూప్ లేకుండానే ఇద్దరూ యాక్షన్ సీన్‌లో పాల్గొనగా.. ఆర్యకు గాయాలయ్యాయని తెలుస్తుంది. దీంతో తనను ఆస్పత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని సమాచారం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా.. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే కంప్లీట్ అయింది. ప్రకాశ్ రాజ్ కూడా ప్రధానపాత్రలో కనిపించబోతున్న చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మృణాళిని రవి ఫీమేల్ లీడ్ చేస్తున్న సినిమాను మినీ స్టూడియో బ్యానర్ నిర్మిస్తుంది.



Next Story

Most Viewed