‘తలైవి’లో అరవింద్ స్వామి మ్యాజిక్ లుక్

by  |
‘తలైవి’లో అరవింద్ స్వామి మ్యాజిక్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘తలైవి’. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద స్వామి పురట్చి తలైవర్ ఎం.జి. రామచంద్రన్ పాత్రలో కనిపించబోతున్నారు. తన పోర్షన్‌కు సంబంధించి లాస్ట్ డే షూట్ కంప్లీట్ చేసిన ఆయన.. పురట్చి తలైవర్ బ్యూటీ అండ్ చార్మ్‌కు వీలైనంత దగ్గరగా తనను తీసుకొచ్చేలా మ్యాజిక్ వర్క్ చేసిన ఇండియన్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరైన పట్టణం రషీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మేకప్ రూమ్‌ నుంచి ఇందుకు సంబంధించిన పిక్ కూడా షేర్ చేశారు అరవింద స్వామి. కాగా రషీద్ బెస్ట్ మేకప్ ఆర్టిస్టుగా 55వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.



Next Story

Most Viewed