2021లో ఆ రెండు కీలకం

by  |
2021లో ఆ రెండు కీలకం
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాదిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ముఖ్యమైనవిగా ఉండనున్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్(ఐఈఈఈ) తాజా అధ్యయనం వెల్లడించింది. యూఎస్, యూకే, చైనా, ఇండియా, బ్రెజిల్ దేశాల్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్(సీఐవో), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లు ఈ సర్వేలో పాల్గొన్నారు.

దీనికి సంబంధించి సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను ఐఈఈఈ సంస్థ సోమవారం విడుదల చేసింది. 2021లో అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సర్వే నిర్వహించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతమేరకు వినియోగించారు, ఏ పరిశ్రమలు సాంకేతిక పరిజ్ఞానానికి ప్రభావితమయ్యాయో ఈ సర్వే పరిశీలించింది. ఈ సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో మూడింట ఒక వంతు(32 శాతం మంది) ఏఐ, మెషిన్ లెర్నింగ్ తర్వాత 5జీ(20 శాతం), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(14 శాతం) ప్రభావితమయ్యే వాటిలో ముందున్నాయని ఐఈఈఈ తన ప్రకటనలో తెలిపింది.

వీటి తర్వాత తయారీ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, విద్య రంగాలు సాంకేతిక పరిజ్ఞానానికి ప్రభావితమవుతాయని నమ్ముతున్నామని పరిశ్రమల సీఐవోలు, సీటీవోలు చెప్పారు. ఇదే సమయంలో సగం కంటే ఎక్కువ(52 శాతం) మంది సీఐవోలు, సీటీవోలు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కొవిడ్-19 సంక్షోభ సమయంలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొన్నట్టు తెలిపారు.



Next Story