‘బచ్చన్ పాండే’కు ఫ్రెండ్‌గా సర్క్యూట్

by  |
‘బచ్చన్ పాండే’కు ఫ్రెండ్‌గా సర్క్యూట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘బచ్చన్ పాండే’ సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్‌’ సర్క్యూట్ క్యారెక్టర్‌‌లో తన కామెడీ టైమింగ్ అర్షద్ వార్షిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురాగా.. కృతి సనన్ హీరోయిన్‌గా నటించనుంది.

సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ జైసల్మేర్‌లో జరగనుంది. ఫస్ట్ షెడ్యూల్‌ను జనవరి నుంచి మార్చి వరకు ప్లాన్ చేసినట్టు తెలిపారు ఫిల్మ్ మేకర్స్. కాగా ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ అయిన అక్షయ్ హీరో కావాలని కలలు కంటుంటే.. జర్నలిస్ట్‌ కృతి డైరెక్టర్‌ అయిపోవాలని అనుకుంటుందట. ఇక అర్షద్ వార్షి అక్షయ్ ఫ్రెండ్‌గా కనిపించనుండగా.. మరో యాక్టర్ ఈ సినిమా కోసం సైన్ చేయాల్సి ఉందని తెలిపారు మేకర్స్. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న సినిమాలో అర్షద్ కామిక్ అదిరిపోనుండగా.. అఖి – అర్షద్ కాంబినేషన్ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వనుంది.

కాగా ప్రస్తుతం డైరెక్టర్ ఫర్హాద్.. జైసల్మేర్‌లో షూటింగ్ స్పాట్స్ వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. జైసల్ కోట్, గడిసర్ లేక్ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయాలనుకుంటున్న డైరెక్టర్.. సెట్స్‌లో కాకుండా రియల్ ప్లేసెస్‌లోనే యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ చేయాలని అనుకుంటున్నారని టాక్.


Next Story

Most Viewed