కామారెడ్డిలో ‘జవాన్’ మిస్సింగ్.. సెలవుపై ఇంటికొచ్చి తిరిగి వెళ్తుండగా..!

by Batti.Sumithra |   (  Updated:2021-09-05 00:59:14  IST  )

<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపింది. సెలవు నిమిత్తం వచ్చి తిరిగి విధులకు బయలుదేరిన జవాన్ అటు విధులకు హాజరు కాక, ఇటు ఇంటి వద్ద లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫొన్ స్విచ్చాఫ్ రావడంతో జవాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జవాన్ మిస్సింగ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన కెంగర్ల నవీన్ కుమార్(28) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ [&hellip;]</p>

కామారెడ్డిలో ‘జవాన్’ మిస్సింగ్.. సెలవుపై ఇంటికొచ్చి తిరిగి వెళ్తుండగా..!
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపింది. సెలవు నిమిత్తం వచ్చి తిరిగి విధులకు బయలుదేరిన జవాన్ అటు విధులకు హాజరు కాక, ఇటు ఇంటి వద్ద లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫొన్ స్విచ్చాఫ్ రావడంతో జవాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జవాన్ మిస్సింగ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన కెంగర్ల నవీన్ కుమార్(28) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వద్ద ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల ఆగస్టు 4న సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు.

సెలవులు ముగించుకుని తిరిగి ఆగస్టు 29న కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఆగస్టు 29న వెళ్ళినప్పటి నుంచి అతని కుటుంబ సభ్యులు ఫొన్ చేస్తే స్విచాఫ్ రావడంతో ఆర్మీ అధికారులకు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. నవీన్ కుమార్ ఇంకా విధులకు హాజరుకాలేదని అక్కడి ఆర్మీ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితుల వద్ద ఎంత వెతికినా జవాన్ ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు జవాన్ తల్లి మణెమ్మ కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు.

Next Story